నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో బొలేరో, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన రామదాస్‌గా గుర్తించారు.
కిసాన్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - road accident at nizamabad district balkonda mandal
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ప్రమాదవశాత్తు బొలేరో వాహనం ఢీకొట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదం.. తీసింది నిండు ప్రాణం
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రామ్దాసుని ప్రమాదవశాత్తు బొలేరో వాహనం ఢీకొట్టింది. తల పగిలి తీవ్ర రక్తాస్రావం కావటంతో అతడు స్పాట్లోనే చనిపోయాడు. గత కొన్ని రోజులుగా కిసాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా స్థానికులు తెలిపారు. పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:పందిని తప్పించబోయి ప్రమాదం: ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు