హైదరాబాద్ మలక్‌పేటలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చాదర్‌ఘట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు.. నల్గొండ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారులో నుంచి బయటికి దిగిన వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న చాదర్‌ఘట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
అతివేగం: డివైడర్‌ను ఢీ కొట్టిన కారు - మలక్ పేటలో రోడ్డు ప్రమాదం
నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
మలక్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం