రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి ఠాణా పరిధిలో ఓ నీళ్ల ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. మహఫిల్ హోటల్ ముందు నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
దూసుకొచ్చిన ట్యాంకర్... నాలుగు వాహనాలు ధ్వంసం - తెలుగు తాజా వార్తలు
నడిరోడ్డుపై ఓ నీళ్ల ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి ఠాణా పరిధిలో జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
దూసుకొచ్చిన ట్యాంకర్... నాలుగు వాహనాలు ధ్వంసం
వాహనం బ్రేకులు పనిచేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:సీఐ ఫేస్బుక్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు