తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బైక్... ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి

ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదం ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road-accident-at-mulugu-two-rtc-employees-died
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బైక్... ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి

By

Published : Mar 21, 2021, 9:04 AM IST

ములుగు జిల్లా కేంద్రంలోని పందికుంట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు నర్సంపేట ఆర్టీసీ డిపో కంట్రోలర్ సదానందం, మహిళా కండక్టర్ సునీత ఉద్యోగరీత్యా ద్విచక్రవాహనంపై బయలుదేరారు.

పందికుంట సమీపంలో ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఎస్సారెస్పీలో కొట్టుకొచ్చిన మృతదేహం

ABOUT THE AUTHOR

...view details