నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గేట్ సమీపంలో 167వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు లారీల ఢీ.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గేట్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రెండు లారీల ఢీ.. ఒకరు మృతి
మృతుడు నల్గొండ జిల్లా గుర్రంపోడు గ్రామానికి చెందిన కోటేష్గా గుర్తించారు. లారీలో పత్తిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తుండగా మాగనూరు ఇటుక బట్టీల నుంచి మరో లారీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.