అనారోగ్య సమస్యకు మందులు వేసుకున్న తగ్గకపోవటంతో చికిత్స కోసం ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి బయలుదేరిన ఓ వ్యక్తి... అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మృతి చెందాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన స్వామి అనే వ్యక్తి గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఇబ్బందిగా ఉండటంతో ఓ టాబ్లెట్ వేసుకున్నాడు.
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి - hyderabad district latest news
డివైడర్‌ను ద్విచక్రవాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి సమీపంలోని వివేకానందనగర్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కూకట్‌పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
ఉపశమనం లభించకపోవటంతో ద్విచక్ర వాహనంపై కూకట్‌పల్లిలోని ఆసుపత్రికి బయలుదేరాడు. వివేకానందనగర్‌కు చేరుకోగానే... అప్పటికే ఇబ్బంది పడుతున్న స్వామి.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన స్వామిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:భారీగా నల్లబెల్లం పట్టివేత.. డ్రైవర్ పరార్