ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన వెంకన్న అతడి సోదరి లక్ష్మి, ఆమె ఇద్దరు పిల్లలు కొణిజర్లలో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా... పీఎస్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కిందపడిన ఇద్దరు వ్యక్తులపై అదే సమయంలో అటుగా వెళ్తోన్న లారీ ఎక్కడంతో వెంకన్న అక్కడిక్కడే మృతి చెందాడు. లక్ష్మికి తీవ్రగాయాలు కావడంతో.. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదంలో ఇద్దరు మృతి.. అటుగా వెళ్తోన్న ఎంపీ నామ చూసి.. - ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టగా... ఆ తర్వాత కింద పడిన క్షతగాత్రులపై లారీ ఎక్కడంతో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో మహిళను ఖమ్మం తరలిస్తుండగా... మృతి చెందింది. అటుగా వెళ్తోన్న ఎంపీ నామ నాగేశ్వరరావు చూసి... అధికారులకు సమాచారం అందించారు.
ప్రమాదంలో ఇద్దరు మృతి.. అటుగా వెళ్తోన్న ఎంపీ నామ చూసి..
ఘటన జరిగిన సమయంలో తల్లాడ వైపు వెళ్తోన్న ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు క్షతగాత్రులను చూసి అధికారులకు సమాచారం అందించారు. గాయపడ్డ చిన్నారులను తన కారులో ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో ఖమ్మం సత్తుపల్లి జాతీయ రహదారిపై కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి.