హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తుండగా గుండ్లపల్లి మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఆటోతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
లైవ్ వీడియో: కారు బీభత్సం... పలువురికి తీవ్ర గాయాలు - telangana news
హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వెళ్తున్న కారు గుండ్లపల్లి మూలమలుపు వద్ద అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న ఆటోతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడితో పాటు ఆటోలో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
లైవ్ వీడియో: కారు బీభత్సం... పలువురికి తీవ్ర గాయాలు
కారు అతివేగంతో దూసుకొచ్చి సైకిల్, ద్విచక్ర వాహనాన్ని తగిలి... రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ఆటోను ఢీకొట్టగా ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడితో పాటు ఆటోలో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108 సహాయంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కాలువ ప్రమాదం.. 25 గేదెలు మృతి