మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్, ఆయన భార్య జమున, డ్రైవర్ సుమన్ కారులో హైదరాబాద్‌కు వస్తున్నారు. అవుషాపూర్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ కారుకు ప్రమాదం - భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ వార్తలు
భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ కారు ప్రమాదానికి గురైంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని వరంగల్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
![భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ కారుకు ప్రమాదం భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ కారు ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:50:14:1621178414-tg-hyd-51-16-ghakesar-accident-av-ts10026-16052021200618-1605f-1621175778-351.jpg)
భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ కారు ప్రమాదం
అందులో ఉన్న ముగ్గురిని స్థానికుల సహాయంతో 108 వాహనంలో ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు