హైదరాబాద్ చాదర్‌ఘాట్ నుంచి కోఠికి వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. అదే సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్య భర్తలను మరో ఆటో ఢీకొట్టింది. దీంతో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో అక్కడే డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు... పారిపోతున్న ఆటోడ్రైవర్‌ను వెంబడించి పట్టుకున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. దంపతులకు గాయాలు - తెలంగాణ వార్తలు
ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు పారిపోతున్న ఆటో డ్రైవర్‌ను పట్టుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. దంపతులకు గాయాలు
తీవ్రగాయాలపాలైన భార్యాభర్తలను 108 వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:ఎంపీటీసీపై సినీ ఫక్కీలో హత్యాయత్నం..!