ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాటాకుల గూడెంకు చెందిన పిగిలి దుర్గారావు( 45), అతని స్నేహితుడు కామినేని నరసింహ రావుతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపలిలోని అత్తగారింటికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నారవారిగూడెం కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారవారిగూడెంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు.

రోడ్డు ప్రమాదం
ఈ ఘటనలో దుర్గారావు రెండు కాళ్లు నుజ్జునుజై ఛాతిలో బలమైన గాయం అయింది. నరసింహరావు కూడా గాయాలయ్యాయి. నారవారిగూడెం ఉప సర్పంచ్ సురేష్ నాయుడు స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దుర్గారావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు.