హైదరాబాద్ అమీర్‌పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు కానిస్టుబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో మీర్‌చౌక్ ఠాణాలో పనిచేసే వేణుబాబు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అమీర్‌పేట సోనాబాయి దేవాలయ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
అమీర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు - తెలంగాణ వార్తలు
ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటన హైదరాబాద్ అమీర్‌పేటలో జరిగింది. కానిస్టేబుల్ తనంతట తానుగా ప్రమాదానికి గురయ్యాడా లేక వేరే వాహనం ఢీకొనడంతో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదం
ఈ ఘటనలో వేణుబాబు తలకు తీవ్ర గాయం కావడంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. బాధితుడు వేణుబాబు అదుపుతప్పి తనంతట తానుగా ప్రమాదానికి గురయ్యాడా లేక వేరే వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు