ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా అనంతసాగరం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ.. గిరిజన మహిళపై అత్యాచారానికి యత్నించడం కలకలం రేపింది. అనంతసాగరానికి చెందిన ఓ గిరిజన వివాహిత అనారోగ్యం బారిన పడి ఆర్ఎంపీ వద్దకు వెళ్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే..
నీరసంగా ఉండటం వల్ల ఓ గిరిజన మహిళ వైద్యం కోసం బుధవారం భర్తతో కలిసి ఆర్ఎంపీ తుపాకుల సుభ్రమణ్యం దగ్గరకు వెళ్లింది. ఆ మహిళకు లోబీపీ ఉందని మందులు రాసి ఇచ్చాడు. ఈ క్రమంలో మహిళ భర్త మందుల కోసం వెళ్లగా.. ఆ వైద్యుడి బుద్ధి వక్రమార్గంలో పయనించింది. ఇంజక్షన్ ఇవ్వడంతో స్పృహ తప్పానని, అనంతరం ఆర్ఎంపీ తనపై అత్యాచారానికి యత్నించాడని బాధిత మహిళ పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:ఈదులు గీసిన మంత్రి