మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ (37) కరోనాతో మృతి చెందారు. ఈ నెల 22న అనారోగ్యంతో తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా నిర్ధారణ అయింది. వెంటనే అదే ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందారు.
Corona Death : కరోనాతో ఆర్ఎంపీ వైద్యుడు మృతి.. ఎర్రబెల్లి సంతాపం - corona deaths in telangana
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కరోనాతో మృతి చెందారు. వైద్యుడి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
కరోనాతో ఆర్ఎంపీ వైద్యుడు మృతి
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. శ్వాస సమస్య తలెత్తడంతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ డాక్టర్ మృతి చెందారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. డాక్టర్ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతాపం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి:దారుణం: బాలికపై పెద్దనాన్న అత్యాచారం