అసలేం జరిగింది??
తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గొల్లపూడిలో జరిగింది. మౌలానగర్‌లో నివాసం ఉంటున్న హోంగార్డు వినోద్‌కుమార్.. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఏఎస్పీ శశిభూషణ్ క్యాంప్‌కు అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకి హోంగార్డు వినోద్ వద్ద ఉంది.
ఆదివారం రాత్రి భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ జరిగి.. తుపాకీ గుండు వినోద్ భార్య సూర్యరత్న ప్రభ గుండెలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై స్పందించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హోంగార్డుని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.