తుపాకి మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గొల్లపూడిలో జరిగింది. మౌలానగర్‌లో నివాసం ఉంటున్న హోంగార్డు వినోద్‌కుమార్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అదనపు ఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
తుపాకి మిస్‌ఫైర్.. హోంగార్డు భార్య మృతి
తుపాకి మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య చనిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గొల్లపూడిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తుపాకి మిస్‌ఫైర్.. హోంగార్డు భార్య మృతి
ఉదయం కూరగాయలతో పాటు ఎస్పీ ఇంటి నుంచి పొరపాటున తుపాకిని వినోద్ ఇంటికి తీసుకొచ్చాడు. దానిని భార్యకు ఇచ్చి బీరువాలో పెట్టమని చెప్పగా.. బీరువాలోకి తీసుకెళ్తున్న క్రమంలో తుపాకి మిస్‌ఫైర్ కావడంతో వినోద్ భార్య సత్యప్రభ అక్కడిక్కక్కడే చనిపోయింది.
ఇదీ చదవండి:సరికొత్త సైబర్ ఎత్తుగడలు.. యువతులతో ఫోన్లు చేయిస్తున్న నేరస్థులు