తెలంగాణ

telangana

ETV Bharat / crime

అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం.. నిందితుడు పరారి - sangareddy district updates

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మండల పరిధిలో రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు సంయుక్తంగా దాడులు జరిపారు. 37 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

gas cylinder seez in sangareddy district
గ్యాస్ సిలిండర్లు సీజ్

By

Published : Mar 30, 2021, 8:23 PM IST

పటాన్ చెరు మండల పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు రీఫిల్లింగ్ చేస్తున్న నిర్వాహకునిపై కేసు నమోదు చేసి.. సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ పరిధిలోని ఆంధ్రాకాలనీలో అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్నారని సమాచారం అందుకుని రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు సంయుక్తంగా దాడులు జరిపారు.

అధికారులు వస్తున్నారని సమాచారంతో నిర్వాహకుడు పరారయ్యాడు. అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్న గది తాళాలు పగలగొట్టి వినియోగిస్తున్న 37 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకునిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:లక్షల విలువైన సిగరెట్లు అమ్మే వ్యక్తి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details