హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తా వద్ద రెమ్‌డెసివిర్(Remdesivir) ఇంజక్షన్లను అధిక ధరకు అమ్ముతున్న సంతోష్ అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్(taskforce) పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సంతోష్.. మదీనాగూడలోని లక్ష్మి ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్నాడు.
Remdesivir: అధిక ధరకు రెమ్‌డెసివిర్ విక్రయం.. పోలీసుల అదుపులో నిందితుడు - పంజాగుట్టలో అధిక ధరకు రెమ్‌డెసివిర్ విక్రయం
అధిక ధరకు రెమ్‌డెసివిర్(Remdesivir) ఇంజక్షన్‌ను అమ్ముకుంటున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
![Remdesivir: అధిక ధరకు రెమ్‌డెసివిర్ విక్రయం.. పోలీసుల అదుపులో నిందితుడు remdesivir selling at high cost](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:35:39:1622253939-tg-hyd-13-29-task-force-caught-remidisiver-injection-seller-av-ts10008-29052021070600-2905f-1622252160-349.jpg)
అధిక ధరకు రెమ్‌డెసివిర్ విక్రయం
రూ. 3,400కు లభించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను అక్రమంగా రూ. 30 వేలకు పంజాగుట్ట చౌరస్తా వద్ద విక్రయిస్తున్నాడు. ఆ సమయంలో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేష్, ఎస్సై షేక్ కవి ఉద్దున్.. తమ బృందంతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి:Police: బంధువులు కరవై.. పోలీసులే ఆ నలుగురై!