మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెల్త్ కేర్, పల్స్ ఆస్పత్రుల యాజమాన్యం అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అధిక ధరకు విక్రయిస్తోంది. ఒక్కో ఇంజక్షనుకు రూ. 25 వేల నుంచి 30వేల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని ఏసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ అమ్ముతున్న ముఠా అరెస్ట్ - తెలంగాణ వార్తలు
కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ఆస్పత్రుల యాజమాన్యాలు అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా రెమ్డెసిివిర్ను అమ్ముతున్నట్లు గుర్తించారు.
పోలీసులు, ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ రెమ్‌డెసివిర్ అక్రమ దందా ఆగడం లేదన్నారు. మెడికల్ మాఫియా కరోనా రోగుల బలహీనతను ఆసరా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. కరోనా బాధితుల పేరుమీద డాక్టర్ యొక్క నకిలీ మందుల చిట్టిని తయారుచేసి, హైదరాబాద్‌లో రెమ్‌డెసివిర్ కొనుగోలు చేసి మంచిర్యాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ముఠా సభ్యులు సంతోష్, రాజేందర్, రమేష్‌ను అదుపులోకి తీసుకున్నామని.. రంజీత్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.
ఇదీ చదవండి:కిటకిటలాడిన ముషీరాబాద్ చేపల మార్కెట్