చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న షేక్ ఖాజామియా(35) ఆత్మహత్య చేసుకున్నాడు. టవల్‌తో జైలులోని కిటికీకి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఖాజామియా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
Prisoner Suicide: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య - చర్లపల్లి జైలు
చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైలులోని కిటికీకి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన సిబ్బంది హుటాహుటిన ఉస్మానియాకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
17 రోజుల క్రితం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులో అరెస్టయిన ఖాజామియాను పోలీసులు మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చర్లపల్లి జైలులో ఉంటున్నాడు. మృతుడు మిర్యాలగూడలోని తాళ్లగడ్డకు చెందిన వ్యక్తి అని జైలు సిబ్బంది తెలిపారు.