వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందంటూ.. బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఏదుట ఆందోళన చేపట్టారు. సమయానికి కాన్పు చేయకపోవడంతో.. బిడ్డ కడుపులోనే ప్రాణాలు కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇది జరిగింది.
వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన అరుణ.. గత రాత్రి పురిటి నొప్పులతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు.. ఆమెకు శస్త్ర చికిత్స చేయకుండా సాధారణ ప్రసవం కోసం వేచి చూశారు. తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో.. బంధువులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. ఉదయం ప్రసవం చేసిన వైద్యులు.. అప్పటికే పసికందు చనిపోయిందని వారికి తెలిపారు.