తెలంగాణ

telangana

ETV Bharat / crime

పుట్టుకతో చెవిటి, మూగ యువతిపై బంధువు అత్యాచారం.. - ts news

దివ్యాంగులను చూస్తే జాలిపడతాం. తోచిన సహాయం చేస్తాం. కానీ విచక్షణ కోల్పోయిన ఓ దుర్మార్గుడు మానసిక స్థితి సరిగా లేని యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆడదైతే చాలు అవసరాన్ని తీర్చేసుకుందామనుకున్నాడు. చెవిటి, మూగ దివ్యాంగ యువతిపై ఆమె బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

చెవిటి, మూగ యువతిపై బంధువు అత్యాచారం..
చెవిటి, మూగ యువతిపై బంధువు అత్యాచారం..

By

Published : May 15, 2022, 9:41 PM IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక దివ్యాంగురాలిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పుట్టుకతో మూగ, చెవుడు అయిన మానసిక దివ్యాంగురాలి(25)పై కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన నూతి ఏడుకొండలు(45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడుకొండలు ఆ యువతికి దూరపు బంధువు అవుతారని పోలీసులు వెల్లడించారు.

శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామానికి చెందిన కౌలు రైతు కుటుంబం నిమ్మ తోటను కౌలుకు తీసుకొని తోటలోనే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు శుక్రవారం శుభకార్యానికి వేరే ఊరు వెళ్లారు. దివ్యాంగ యువతి(25) నిమ్మ తోటలోని నివాస గృహంలో ఒంటరిగా ఉంది. యువతి బంధువు, కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఎన్‌.ఏడుకొండలు(45) ఓ పని నిమిత్తం యువతి ఇంటికి వచ్చాడు. ఒంటరిగా ఉండటంతో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన తన కుటుంబసభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించి బోరున విలపించింది. శుక్రవారం రాత్రి బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని శాలిగౌరారం ఎస్సై సతీశ్‌ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం నకిరేకల్‌ ప్రభుత్వ వైద్యశాలకు పంపించామని తెలిపారు.

"శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవిటి అయిన ఓ యువతిపై నూతి ఏడుకొండలు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆ యువతికి వరసకు మామ అవుతాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం." -సతీశ్​, ఎస్సై

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details