తెలంగాణ

telangana

ETV Bharat / crime

రైతుల నిలదీత.. ఆర్బీకే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం - బాపట్ల ఆర్బీకే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. పంట పరిహారం అందలేదని రైతులు నిలదీయడంతో మనస్తాపానికి గురై.. హరిబాబు అనే అధికారి పురుగుల మందు తాగాడు. గమనించిన వ్యవసాయశాఖ సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు.

రైతుల నిలదీత.. ఆర్బీకే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం
రైతుల నిలదీత.. ఆర్బీకే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 18, 2022, 4:56 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి ఆర్బీకే అగ్రికల్చర్ అసిస్టెంట్ హరిబాబు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. పంట పరిహారం అందలేదని కొందరు రైతులు హరిబాబును నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురైన హరిబాబు.. మార్టూరు వ్యవసాయశాఖ అధికారులతో జరిగిన విషయం చెప్పాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించాడు. గమనించిన వ్యవసాయశాఖ సిబ్బంది.. హరిబాబును చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details