హైదరాబాద్ శివారు రిసార్ట్‌పై పోలీసుల దాడి, యువకుల నుంచి గంజాయి లభ్యం.. - హయత్‌నగర్‌లో రేవ్ పార్టీ
21:31 December 03
హయత్ నగర్ పసుమాములలో గంజాయి పార్టీ..
హయత్ నగర్ పసుమాములలో గంజాయి పార్టీ కలకలం రేపింది. నగర శివారులో యువకుల పార్టీపై పోలీసులు దాడి చేశారు. హయత్ నగర్ మండలం పసుమాములలో ఓ యువకుడి జన్మదిన వేడుకలలో గంజాయి వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 29 మంది యువకులు, నలుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సీబీఐటీ, ఎంజీఐటీ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.
వీరి వద్ద నుంచి 11 కార్లు, ఒక బైక్, 28మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు బుధవారం తిరిగి తమ పిల్లలతో పీఎస్‌కు రావాలని ఆదేశించారు. పట్టుబడిన యువకులను విడిచిపెట్టారు.
ఇవీ చదవండి: