తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎంత పని చేసింది ఎలుక.. ఆ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రాణాపాయం - Andhra Pradesh Crime News

Fire Accident in Anantapur: ఎలుక వలన ఒక కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. పూజ గదిలో ఉన్న దీపం వత్తిని, ఎలుక తీసుకెళ్లి ఫ్రిడ్జ్ కింద పెట్టడంతో మంటలు అంటుకున్నాయి. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.

Fire Accident in Anantapur
Fire Accident in Anantapur

By

Published : Jan 10, 2023, 3:50 PM IST

Fire Accident in Anantapur: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం పాతూరు బోయ వీధిలోని శివ శంకరప్రసాద్ అనే వ్యక్తి ఇంటికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పూజ గదిలో మండుతున్న దీపం వత్తిని ఎలుక తీసుకెళ్లి ఫ్రిడ్జ్ కింద పెట్టడంతో వైరుకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఫ్రిడ్జ్​కు మంటలు అంటుకున్నాయి. ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు రావడంతో, అప్రమత్తమైన ఇంటి యజమాని తన కుమారుడుతో కలిసి మంటలను ఆర్పారు.

చుట్టుపక్కల వాళ్లు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో, వారు చేరేలోపు మంటలు ఆరిపోయాయి. పూజ గదిలో అప్పుడప్పుడు ఎలుకలు దీపం వత్తులను తీసుకెళ్తుంటాయని, ఈసారి కూడా అదే జరిగి ఉండొచ్చని గృహస్తులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details