తెలంగాణ

telangana

ETV Bharat / crime

Palnadu Rape: కుమారుడి ముందే తల్లిపై అత్యాచారం.. - ఏపీ తాజా నేర వార్తలు

Palnadu Rape: ఆమెది ఈ రాష్ట్రం కాదు.. ఈ భాషా కాదు. కూలీ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక తన రెండు సంవత్సరాల కొడుకుతో.. దిక్కుతోచని స్థితిలో రైల్వే స్టేషన్​లోని హాల్ట్ భవనం వద్ద ఒంటరిగా నిద్రించింది. అదే ఆమె చేసిన తప్పు.. ఎందుకంటే ఆమెపై ఇద్దరు వ్యక్తులు అతికిరాతకంగా అత్యాచారం చేశారు. ఇంతకీ ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Rape on woman
Rape on woman

By

Published : Apr 17, 2022, 10:04 AM IST

Palnadu Rape: రెండు సంవత్సరాల కొడుకు ముందే కన్నతల్లిపై అత్యాచారం జరిగిన దారుణ ఘటన ఏపీలోని గురజాల వట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ నందు చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గుర్తుతెలియని మహిళపై ఇద్దరు వ్యక్తులు అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వేస్టేషన్​లో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న మహిళను స్థానికులు చూసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ పక్కనే రెండేళ్ల బాబు ఉన్నాడని అక్కడి ఉన్నవాళ్లు తెలిపారు. మహిళ బాగా నీరసంగా ఉండడంతో ఎలాంటి వివరాలు చెప్పలేకపోతుందని వైద్యురాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం తనపై అత్యాచారం చేసినట్లు చెబుతోందని పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

న్యాయం చేయాలని డిమాండ్: ఈ ఘటనపై వామపక్షాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గురజాల మున్సిపల్ ఛైర్మన్ పోలు వీరారెడ్డి, మాజీ శాసన సభ్యులు యరవతినేని శ్రీనివాసరావు బాధిత మహిళను పరామర్శించారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు.

ఇదీ చదవండి:ఫేస్​బుక్ పరిచయం.. ఆమెకు ప్రాణసంకటం.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే.!

ABOUT THE AUTHOR

...view details