రాష్ట్రంలో కామాంధుల అకృత్యాలు ఆగటం లేదు. మృగాళ్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఒక ఘటన జరిగి అందులో నుంచి తేరుకోకముందే మరోటి వెలుగు చూస్తూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒకచోట కామాంధుల దాటికి మగువలే కాదు.. ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా బలవుతూనే ఉన్నారు. వావివరసలు, చిన్నాపెద్ద తేడా లేకుండా.. విచక్షణారహితంగా కీచకులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.
Nizamabad Rape: నిజామాబాద్లో ఇద్దరు బాలికలపై ఆత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. - rape on minors
14:48 October 07
నిజామాబాద్లో ఇద్దరు బాలికలపై ఆత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే.. నిజామాబాద్ జిల్లాలోనూ అలాంటి ఘటనే మరొకటి జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఇద్దరు బాలికలపై ఓ మానవమృగం అకృత్యానికి పాల్పడింది. ఈ దారుణం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
విచ్చలవిడి మద్య సేవనమో.. వినాశకాల బుద్ధో.. మానవులు కాస్తా కామానవులు అవుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఇంకెన్ని చట్టాలొచ్చినా.. అవేవీ కామాంధుల అకృత్యాలకు కళ్లెం వేయలేకపోతున్నాయి.
ఇదీ చూడండి:
hyderabad rape case: ఆగని అకృత్యాలు.. హైదరాబాద్‌లో మరో బాలికపై అత్యాచారం