RAPE ON TRNASGENDER: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా పులివెందులలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ట్రాన్స్ జెండర్‌పై 15మంది అత్యాచారం చేసి.. కంప చెట్లలో పడేశారని తోటి ట్రాన్స్జెండర్లు వెల్లడించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పట్టించుకోలేదని.. దాంతో దిశ యాప్‌కు కాల్ చేశామని చెప్పారు.
సీఎం సొంత జిల్లాలో దారుణం.. ట్రాన్స్ జెండర్‌పై 15మంది అత్యాచారం - ఏపీ లేటెస్ట్ న్యూస్
RAPE ON TRNASGENDER: కామంతో రెచ్చిపోతున్న కొందరు మగాళ్లకు ఆడది కనబడితే చాలు వాళ్లల్లో ఉన్న మృగం బయటికి వస్తుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి ట్రాన్స్జెండర్లను కూడా వదలడం లేదు. తాజాగా 15 మంది కలిసి ఓ ట్రాన్స్‌జెండర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ముళ్ల కంపలో పడేసిన దారుణ ఘటన ఏపీలోని పులివెందులలో చోటుచేసుకుంది.
RAPE ON TRNASGENDER
దిశ అధికారుల ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు స్పందించారని తెలిపారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయకపోతే అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తమను చిన్న చూపు చూస్తున్నారని.. సమాజంలో బతికే హక్కు తమకు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: