RAPE ON MINOR GIRL: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై 24 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు ప్రైవేటు జాబ్ చేస్తూ మాధవరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల ముంబయి నుంచి మాధవరంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలికను అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే కొద్ది రోజుల క్రితం ముంబయి వెళ్లిన బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చిందని చెప్పడంతో ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ముంబయిలో కేసు నమోదు చేశారు. అయితే ముంబయి పోలీసులు కేసును మంత్రాలయానికి బదిలీ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై మంత్రాలయం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.