తెలంగాణ

telangana

ETV Bharat / crime

బహిర్భూమికి వెళ్లిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం - అనకాపల్లి లేటెస్ట్ అప్​డేట్స్

Rape on Minor Girl : ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న వరుస అత్యాచారాలు కలవరం రేపుతున్నాయి. ఆరేళ్ల పసిపిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి వాళ్ల వరకు మృగాళ్లు ఎవరినీ వదలడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బహిర్భూమికి వెళ్లిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం..!
బహిర్భూమికి వెళ్లిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం..!

By

Published : May 6, 2022, 10:02 AM IST

Rape on Minor Girl : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి 2గంటల సమయంలో అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లగా.. నిందితుడు బాలికను లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని మరో బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు చుట్టుపక్కల వెతికారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లగా.. నిందితుడు బాలికను లాక్కెళ్లినట్లు తెలుస్తోంది

నిందితుడి వేటకు మూడు బృందాలు: బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు... తల్లిదండ్రులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడి గాలింపు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ మణికంఠ తెలిపారు. అత్యాచారం కేసు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం బాలిక వైద్యుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details