Rape on Blind Woman in AP : అంధ యువతిపై ఓ వివాహితుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న కొండమిట్టలో బాధిత అంధ యువతి కుటుంబం నివాసం ఉంటోంది. యువతి తండ్రి చాలాకాలం కిందట మృతి చెందాడు. బాధిత యువతి నివాసం సమీపంలోనే ఉంటున్న.. ఓ రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు జయచంద్రా రెడ్డి అలియాస్ చిన్నా.. కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.
Rape on Blind Woman in AP : అంధ యువతిపై అత్యాచారం.. కేసు నమోదు - Rape on Blind Woman
Rape on Blind Woman in AP : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏపీలోని చిత్తూరు నగరంలో దారుణం జరిగింది. అంధ యువతిపై ఓ వివాహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

అదే ప్రాంతానికి చెందిన ఓ అంధ యువతికి మాయ మాటలు చెప్పి.. మహిళా దినోత్సవం రోజున చిన్నా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై.. బాధితురాలి తల్లి దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్ సీఐ మురళీమోహన్ తెలిపారు. నిందితుడి తండ్రి పోలీసు శాఖకు చెందినవారు కావడంతో.. కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని బాధితురాలి తల్లి అన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి :ఆ విషయంలో మందలించాడని తమ్ముడిని చంపించిన అక్క