Rape on Beautician: బ్యూటీపార్లర్ పెట్టిస్తానని ఆశ చూపి.. బర్త్‌డే రోజే అత్యాచారం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన మహిళ.. ఆరు నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. గాజులరామారాంలోని ప్రిస్టన్ప్లేస్ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. బ్యుటీషియన్ కోర్స్ నేర్చుకొని బ్యూటీషియన్‌గా పని చేస్తూ.. జీవనం సాగిస్తోంది.
బ్యూటీపార్లర్ పెట్టిస్తానని ఆశ చూపి.. బర్త్‌డే రోజే అత్యాచారం.. - బ్యూటీపార్లర్ పెట్టిస్తానని ఆశ చూపి బర్త్‌డే రోజే అత్యాచారం
Rape on Beautician: బర్త్‌డే వేడుకల సాకుతో వచ్చి బ్యూటీషియన్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన.. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించాగా.. విషయం వెలుగుచూసింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఆ మహిళకు సంజీవరెడ్డి(57)తో పరిచయం ఏర్పడింది. మహిళ అవసరాన్ని తెలుసుకున్న సంజీవరెడ్డి.. బ్యుటీపార్లర్ స్టుడియో పెట్టిస్తానని ఆశచూపాడు. తనకు సాయం చేస్తాననటంతో.. సంజీవరెడ్డిని మహిళ నమ్మింది. ఇదే అదునుగా తీసుకున్న సంజీవరెడ్డి.. నిన్న రాత్రి ఆమె బర్త్‌డే సందర్భంగా మహిళ నివాసానికి వెళ్లాడు. పుట్టినరోజు సాకుతో ఇంటికి వచ్చిన సంజీవరెడ్డి.. తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ.. జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంజీవరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: