పదో తగరతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్ ప్రాంతంలో నివసించే ఓ పదో తరగతి విద్యార్థిని(15) చరవాణిలో చాటింగ్ చేస్తూ ఏడుస్తూ ఉండటాన్ని తండ్రి గమనించాడు. విచారించగా.. మూడు నెలలుగా ఇంటి సమీపంలో నివసించే మహేశ్ అలియాస్ కృష్ణ చైతన్య(20) తనను 'ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటాను' అని నమ్మించాడంటూ తండ్రికి తెలిపింది.
Rape on Minorgirl: అక్కింటికి తీసుకెళ్లాడు.. అత్యాచారం చేశాడు.. - హైదరాబాద్ జిల్లా వార్తలు
పదో తగరతి విద్యార్థినిని... ప్రేమ పేరుతో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. లైంగిక దాడికి పాల్పడి... ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో ఏడుస్తున్న విద్యార్థిని తన తండ్రి గమనించాడు. ఏం అయ్యింది బిడ్డా అని అడుగగా ఇంటి సమీపంలోని వ్యక్తి నమ్మించి మోసం చేశాడని తెలిపింది. వెంటనే విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ క్రమంలోనే గత నెల 19న మహేశ్ తనను తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడని పేర్కొంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రానని చెప్పానని... అయినప్పటికీ బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని, భయపడి పెదవి విప్పలేదని ఆమె తెలిపింది. ఈ మేరకు విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:Husband Kills Wife: పక్కా ప్రణాళికతో చంపేశాడు.. విచారణలో దొరికిపోయాడు..