ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. నగర శివారులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై దుండుగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడికొండ మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న యువతి తన స్నేహితునితో కలిసి గుంటూరుకు బయల్దేరింది. వారు రోడ్డు పక్కన కాసేపు ఆగగా...ఆ సమయంలో కొందరు యువకులు వచ్చి వారిపై కర్రతో దాడి చేశారు. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. యువతి కేకలు వేయటంతో నిందితులు పరారయ్యారు.
Rape Attempt: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం... అంతలోనే.. - ఏపీ వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఏపీలోని గుంటూరు నగర శివారులో జరిగింది.
![Rape Attempt: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం... అంతలోనే.. Rape Attempt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13430554-505-13430554-1634915719341.jpg)
Rape Attempt
ఘటనపై బాధిత యువతి, ఆమె స్నేహితులు ఇవాళ తాడికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు..బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తాడికొండ ఎస్సై వెల్లడించారు.
ఇదీ చూడండి:missing boy found dead: కుంటలో చిన్నారి శవం... ప్రమాదవశాత్తు చనిపోయాడా? చంపేశారా?
Last Updated : Oct 22, 2021, 9:32 PM IST