తెలంగాణ

telangana

ETV Bharat / crime

మూగ యువతిపై కన్నేసిన కామాంధుడు.. శివారుకు తీసుకెళ్లి.. - rape attempt on woman news

కామాంధుల పైశాచికత్వానికి వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మహిళలు బలవుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే రక్షణనివ్వాల్సింది పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి దివ్యాంగులపై కూడా వారి పశువాంఛను తీర్చుకునేందుకు యత్నిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఓ మూగయువతి అత్యాచారానికి యత్నించాడు ఓ కీచకుడు.

rape attempt on a dumb woman
మూగ యువతిపై అత్యాచార యత్నం

By

Published : Sep 24, 2021, 2:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మంచి నీళ్లు కావాలని

జిల్లాకు చెందిన ఓ యువతి పుట్టుకతో మూగ.. మతిస్థిమితం లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో టేకుల పల్లికి చెందిన జీ. మోతీలాల్​(35) అనే వ్యక్తి.. మంచి నీళ్లు కావాలని యువతి ఇంటికి వెళ్లాడు. యువతిని గమనించిన అతను.. ఆమె తండ్రిని ఆరా తీశాడు. కొద్ది సేపటి తర్వాత ఎవరూ లేని సమయం చూసి యువతిని శివారుకు తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న కొందరు ఇది గమనించి.. ఆమె అన్నయ్యకు ఫోన్​ చేసి సమాచారం అందించారు. భయాందోళనకు గురైన సోదరుడు.. పోలీసులకు సమాచారం అందించారు.

మద్యం మత్తులో

ఆ వెంటనే తండ్రితో పాటు స్నేహితులతో ఆ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు.. యువతిని గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న మోతీలాల్​ను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై కుమార స్వామి తెలిపారు.

ఇదీ చదవండి:DEAD BODY IN A BLANKET: భార్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి.. చెరువులో పడేసేందుకు భర్త యత్నం.!

ABOUT THE AUTHOR

...view details