మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఎల్బీనగర్ బండ్లగూడకు చెందిన బండారి నగేష్ ప్రేమ పేరిట ఓ మైనర్ బాలికను నమ్మించి.. ఆమెను బలవంతంగా యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు.
వివాహం చేసుకున్న ఫొటోలను చరవాణిలో తీసుకుని ఆమెను తిరిగి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. తన కోరిక తీర్చకపోతే వివాహం చేసుకున్న చిత్రాలను బాలిక బంధువులకు చూపుతానంటూ బెదిరించాడు.