కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో వీఆర్ఏ నర్సింహులు ఆత్మహత్యాయత్నం చేశారు. రాజంపేట్ మండల కార్యాలయంలో నర్సింహులు వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల విషయంలో ఆర్ఐ ప్రభాకర్ రెండు నెలలుగా తనను టార్గెట్ చేస్తున్నారని నర్సింహులు ఆరోపించాడు. సరిగా పని చెేయడం లేదని వేధిస్తూ... జీతాన్ని ఆపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు వాపోయాడు. మానసిక క్షోభకు గురై... ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొన్నాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
ఆర్ఐ వేధింపులకు వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం - రాజంపేటలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
పని సక్రమంగా చేయట్లేదని... నెల జీతాన్ని ఆపేస్తామని పై అధికారి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
ఆర్ఐ వేధింపులకు వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం