Raging in guntur medical college: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు.. తమను పొడుగు చొక్కాలు ధరించాలని ఆంక్షలు పెడుతున్నారని.. యూజీ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారించి, నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్‌ను ఎన్‌ఎంసీ(NMC) ఆదేశించింది.
అలా చేయాలని సీనియర్ల ర్యాగింగ్.. ఎన్‌ఎంసీకి విద్యార్థుల ఫిర్యాదు - గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్
Raging in guntur medical college: ఆంధ్రప్రదేశ్ గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు.. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు యూజీ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. తమను పొడుగు చొక్కాలు ధరించాలని ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు.

ప్రిన్సిపల్ ఆచార్య పద్మావతి గురువారం తొలుత కళాశాలలో ర్యాగింగ్ కమిటీతో సమావేశం నిర్వహించారు. బాలుర వసతిగృహంలో ఉండే సీనియర్ విద్యార్థులు ఇటీవల కొత్తగా చేరిన యూజీ విద్యార్థి ఒకరిని వసతిగృహంలో పొడుగుచొక్కాలు వేసుకోవాలని సూచించటంతో తనను ర్యాగింగ్ చేస్తున్నారని భావించి ఆ విద్యార్థి ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ విద్యార్థి ఎవరనే విషయం మాత్రం ఎన్‌ఎంసీ గోప్యంగా ఉంచటంతో విచారణ ఎలా చేపట్టాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు.. రంగుల్లో మునిగితేలుతున్న జనం