తెలంగాణ

telangana

ETV Bharat / crime

మారేడుపల్లి ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ - మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అరెస్ట్

మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు అరెస్ట్
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు అరెస్ట్

By

Published : Jul 11, 2022, 11:47 AM IST

Updated : Jul 11, 2022, 2:43 PM IST

11:46 July 11

ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్ఓటి పోలీసులు

అత్యాచారం ఆరోపణలతో సస్పెండ్​ అయిన మారేడ్​పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు అరెస్టయ్యారు. రాచకొండ ఎస్​వోటీ పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. నాగేశ్వరరావు గత రెండేళ్లుగా బాధితురాలిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు.. సెక్షన్ 452, 376(2), 307, 448, 365 ఐపీసీ, ఆయుధాల చట్టం సెక్షన్ 30 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది..

ఈ నెల 6న వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితో పాటు ఆమె భర్తను బలవంతంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు కారులో తీసుకెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావు భుజానికి గాయం కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకొని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దురాగతం బయటపడింది. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్‌ చేశారు. ప్రమాదంలో గాయపడిన ఇన్​స్పెక్టర్ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు యత్నించాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆయనను పట్టుకొనేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఎస్​వోటీ పోలీసులు నేడు నాగేశ్వరరావును అరెస్ట్​ చేశారు.

ఇవీ చూడండి..

రివాల్వర్​ గురిపెట్టి వివాహితపై అత్యాచారం.. మారేడుపల్లి ఇన్​స్పెక్టర్ అరాచకం

హిందువుకు ముస్లింల అంత్యక్రియలు.. బక్రీద్ రోజు వెల్లివిరిసిన మతసామరస్యం

Last Updated : Jul 11, 2022, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details