తెలంగాణ

telangana

ETV Bharat / crime

సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ పరిచయం.. రూ. లక్షన్నర మోసం - telangana crime news

Cheating by Movie Chances: అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని భాగ్యనగరంలో రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాల పేరిట కొందరు మోసాలకు పాల్పడితే.. నచ్చిన రంగంలో ఉపాధి కల్పిస్తామని మరికొందరు నమ్మిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉందని చెప్పి.. అందినకాడికి దోచుకుంటున్నారు. సినీ పరిశ్రమ ఇందుకు మినహాయింపు కాదు. సినీరంగంలో ఉపాధి, సినిమాల్లో పాత్రలు వచ్చేలా చూస్తామని చెప్పి.. అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వ్యక్తిని రాచకొండ సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

cheating in the name of chances in film industry
చిత్ర పరిశ్రమలో అవకాశం పేరిట మోసం

By

Published : Mar 10, 2022, 12:08 PM IST

Cheating by Movie Chances: చిత్ర పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని అమాయకులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని విశాఖపట్నం గాజువాకకు చెందిన కాశీ సునీల్ కుమార్.. ఈజీ మనీపై దృష్టి సారించాడు. అందుకు చిత్ర పరిశ్రమను ఎంచుకుని.. ప్రణాళిక రచించాడు.

నిందితుడు కాశీ సునీల్​ కుమార్​

దాదాపు లక్షన్నర మోసం

సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించే వారిని టార్గెట్​ చేసి.. సునీల్​ వారితో పరిచయాలు పెంచుకున్నాడు. సినీఫీల్డ్​లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి.. ఇండస్ట్రీలో తనకు ఫలానా వ్యక్తులు తెలుసని వారిని నమ్మించేవాడు. అలా వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఓ వ్యక్తి వద్ద రూ. 91,420, మరో వ్యక్తి వద్ద రూ. 42,000 తీసుకున్నాడు. అవకాశం వచ్చేలా చూడమని డబ్బులిచ్చిన వాళ్లు ఎన్నిసార్లు అడిగినా.. ఇవాళ, రేపు అంటూ సాగదీశాడు. రోజులు గడుస్తున్నా.. సరైన స్పందన లేకపోయేసరికి అనుమానం వచ్చిన బాధితులు రాచకొండ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాశీ సునీల్​ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక బ్యాంకు అకౌంట్​ పాస్​ బుక్​, రెండు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:Mother Suicide attempt: తల్లి మనసు విరిగింది.. తనకు తాను కాల్చుకుంది

ABOUT THE AUTHOR

...view details