తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fake CID Arrest: సీఐడీ అధికారినంటూ మహిళను వేధించిన కామాంధుడు... చివరకు.. - హైదరాబాద్​ జిల్లా తాజా వార్తలు

సీఐడీ అధికారినంటూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త నంబర్‌ నుంచి ఓ వ్యక్తి వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ చేసి దుస్తుల్లేకుండా కనిపించాలని.. లేదంటే మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కామాంధుడిని అరెస్ట్​ చేసి రిమాండ్‌కు తరలించారు.

Fake CID Arrest
Fake CID Arrest

By

Published : Nov 17, 2021, 10:14 AM IST

వాట్సప్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారినంటూ వినోద్ కుమార్ అనే వ్యక్తి ...ఇబ్రహీంపట్నం మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళకు కొత్త నంబర్‌ నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ చేసేవాడు. అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలను పంపుతూ మానసికంగా హింసించేవాడు. దుస్తుల్లేకుండా కనిపించాలని.. లేదంటే మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించాడు.

దీంతో విసిగిపోయిన ఆ మహిళ అసలు నువ్వెవరు..? ఎందుకిలా చేస్తున్నావంటూ నిలదీసింది. తాను సీఐడీ(CID officer harassment) విభాగంలో ఉన్నతాధికారిని అని చెప్పాడు. కొంతసేపటికి పోలీసు యూనిఫారంలో వీడియో కాల్‌ చేయడంతో ఆమె భయపడింది. వెంటనే ఆ నెంబరును బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత మరో నంబరు నుంచి మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ రావడం మొదలైంది. సహనం కోల్పోయిన బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోర్న్ వీడియోలకు బానిసై...

నిందితుడు వినోద్ కుమార్ తన మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకుని... ఆ వ్యసనానికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలతో స్నేహం చేసేవాడని... ఆ తరువాత వేధించడం ప్రారంభించేవాడని పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇదీ చదవండి:CID officer harassment: 'నేను సీఐడీ ఉన్నతాధికారిని.. నువ్వు నాకు కావాలంతే.!'

ABOUT THE AUTHOR

...view details