Fraud in the stock market: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలానికి చెందిన బండ్లమూడి రవి.. రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో ఇప్పటికే పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్నోకు చెందిన సందీప్, వీర్‌తో చేతులు కలిపి పలు వెబ్సైట్లు తెరిచారని పేర్కొన్నారు. ములుగు జిల్లా మంగపేటకు చెందిన వేములవాడ రఘు.. రవికి సహకరించాడు. ఇద్దరూ కలిసి గంపగుత్త సందేశాలు పంపారని పోలీసులు తెలిపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తామంటూ ప్రకటనల్లో నమ్మించారన్నారు. ఈ ప్రకటనలు చూసి మల్కాజ్ గిరికి చెందిన సుబ్రమణ్యం, నగేష్ కలిసి విడతల వారీగా 11లక్షల రూపాయలను బండ్లమూడి రవి చెప్పిన ఖాతాలో జమ చేశారని వెల్లడించారు.
మోసపోయానని...