హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ ముఠాలోని శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేష్, కొండల్‌రావును అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. మరో నిందితుడు వెంకటరాజు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.9.8 లక్షల విలువైన హాశిష్ ఆయిల్, ఒక ద్వి చక్రవాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
నిందితులు తయారుచేస్తున్న హాశిష్ ఆయిల్... ఇతర డ్రగ్స్ కంటే చాలా ప్రమాదకరమైనదని సీపీ తెలిపారు. ఒక్క చుక్క తాగిన ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. గంజాయిని తీసుకొచ్చి.. మరిగించి.. అందులో నుంచి వచ్చే చిక్కని రసాయనాన్ని హాశిష్ ఆయిల్గా తయారుచేసి.. అక్రమంగా రవాణా చేస్తున్నారని సీపీ తెలిపారు. బహిరంగ మార్కెట్లో దీని ధర 10 ఎంఎల్ రూ.3300 ఉంటుందన్నారు. నిందితులపై గతంలోనూ కేసులున్నాయన్న సీపీ మహేశ్ భగవత్.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.