Gang of robbers arrested: ఇటువంటి దొంగతనాలు మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాము.. ఒక సూట్‌కేసును పట్టుకొని వస్తారు అందులో ఏమీ ఉండదు.. అయితే నకిలీ దొంగనోట్లు, నకిలీ బంగారం ఉంటాయి. ఆ సూట్కేసుతోనే వ్యాపారులను, ఉద్యోగస్తులను బురిడీ కొట్టించి విలువైన సంపదను దోచుకుపోతారు. ఇటువంటి సీన్లు సినిమాల్లో చూడడానికి బాగానే ఉంటాయి. కానీ నిజ జీవితానికి వచ్చేసరికే బెడిసి కొడతాయి. అటువంటి సినిమా ఫక్కీలోనే ఒక మోసం జరిగింది. ఇది సినిమా కాదు కదా తప్పించుకోవడానికి.. చివరికి ఆ దొంగల ముఠా కటకటాల పాలైయ్యారు.
ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఎల్బీ నగర్ ఎస్వోటి, సరూర్ నగర్ పోలీసులు... 9 మంది నిందుతుల్లో 8మందిని అరెస్ట్ చేశారని వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 45లక్షల రూపాయల నగదు, 13చరవాణీలు, 8 సిమ్‌కార్డులు, ఒక కారు, ద్విచక్రవాహనం, సూట్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
రాచకొండ సీపీ వివరాల ప్రకారం.. తక్కువ ధరకు బంగారం వస్తుందని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 60లక్షల రూపాయలకు కొనడానికి సిద్ధపడతాడు. ఇతనికి స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తిగా ఉండే మహేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బంగారం తక్కువ ధరకు వస్తోందని మహేశ్ అతనికి చెప్పుతాడు. కిలోన్నర బంగారం రూ.60లక్షలకే ఇస్తారని నమ్మబలికాడు. ఈనెల 20న దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ వద్దకు డబ్బు పట్టుకొని రమ్మన్నారు. ఇద్దరు వ్యక్తులు సూట్‌కేసుతో అక్కడికి వెళ్లారు. అయితే ఆ సూట్‌కేసులో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో తెల్ల కాగితాలు నోట్లు అమర్చి, మరోభాగం ఖాళీగా ఉంచారు.
బాధితుడు తెచ్చిన డబ్బును మరో పక్కన పెట్టి.. మాటల్లో దింపు సూటుకేసును మరోక పక్కకు తిప్పారని.. దృష్టి మరల్చి సూటుకేసు మార్చారు. మళ్లీ వస్తామని డబ్బు తమరి దగ్గర ఉంచమని కాగితపు నోట్లతో పేర్చిన సూటుకేసును అతనికి ఇచ్చి వెళ్లిపోయారు. నిందితులు ఎంతకీ రాకపోవడంతో అతను దానిని తెరిచి చూడగా తెల్లకాగితాలు ఉండడంతో మోసపోయానని గ్రహించి సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని మహేష్ భగవత్ వివరించారు.
ఇవీ చదవండి: