మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని దాడులు, వేధింపులకు పాల్పడుతున్న న్యాయవాది సుభాష్‌పై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పీడీ చట్టం నమోదు చేశారు. గతంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసిన సుభాష్... ప్రస్తుతం ఎల్బీనగర్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగులను, మహిళలను వేధిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వివాదస్పద భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని సరూర్‌నగర్ సబ్‌రిజిస్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి... ఆమెపై దాడి చేశారని పేర్కొన్నారు. తను చెప్పినట్లు వినకపోతే తప్పుడు కేసులు బనాయిస్తానని బెదిరించారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.