Chain Snatching and Fake currency gang arrested: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధి హస్తీనాపురంలో జనవరి 1న ముగ్గురు దుండగులు.. ఓ మహిళ మెడలో నుంచి 2 గొలుసులు లాక్కెళ్లారు. గది అద్దెకు తీసుకుంటామనే సాకుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు.. ఇంటి యజమానురాలిని మాటల్లోకి దించారు. తాగేందుకు నీళ్లు కావాలని అడిగి... ఆమె లోపలికి వెళ్లగానే నోరు అదిమిపట్టి రెండు బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అప్పటికే బయట ద్విచక్రవాహనంపై వేచి ఉన్న మూడో వ్యక్తితో కలిసి ముగ్గురు పరారయ్యారు. ఈ ముగ్గురు నిందితులు వేర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు అక్కడే వీరికి పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జూబ్లీహిల్స్‌లో ఉంటున్న నెల్లూరుకు చెందిన వెంకటశేషయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌కు చెందిన అహ్మద్, కుత్బుల్లాపూర్‌లోని చింతల్‌కు చెందిన హరిబాబు అని తెలిపారు. వృద్ధుల ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
జైల్లో ఆ ముగ్గురికి పరిచయం అయింది. గోల్డ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. జైలు నుంచి బయటికివచ్చి ప్రాపర్‌గా రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఆ రోజు హస్తినాపురంలోనూ ఇలాగే చేశారు. దొంగనోట్లను కూడా ముద్రిస్తున్నారు. శ్రద్ధగా పరిశీలిస్తే.. దొంగనోట్లకు, అసలు నోట్లకు తేడా తెలుస్తుంది.