Pudding Pub Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో కొకైన్ వినియోగించినవారి అరెస్ట్‌కు బంజారాహిల్స్ పోలీసులు సమాయత్తమయ్యారు. కొకైన్ సరఫరా, వినియోగంపై అభిషేక్‌తోపాటు మరికొందరికి బలమైన సంబంధాలున్నాయనే కీలకాధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో రాడిసన్ బ్లూ హోటల్‌లోని పబ్‌లో ఆదివారం తెల్లవారుజాము వరకూ జరిగిన విందులు, వేడుకలకు వెళ్లినవారిలో 148 మందిని విచారణకు హాజరు కావాలంటూ తాఖీదులు పంపుతున్నారు. సోమవారం నుంచి వీరిని బంజారాహిల్స్ ఠాణాలో విచారించే అవకాశాలున్నాయి.
పుడింగ్ పబ్‌లోకి కొకైన్ ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు?
Pudding Pub Case : పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తులో వేగం పెంచిన బంజారాహిల్స్ పోలీసులు కొకైన్ వినియోగించిన వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పబ్‌లో కొకైన్ సరఫరా, వినియోగంపై బలమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. అభిషేక్‌తోపాటు మరికొందరికి బలమైన సంబంధాలున్నాయనే కీలకాధారాలు లభించినట్లు తెలిపారు.
Hyderabad Pub Raid Case : ఆ రోజు పబ్‌కు వెళ్లినవారిలో 10-20 మంది వరకూ మాదకద్రవ్యాలు వినియోగించారని కచ్చితమైన ఆధారాలుండటంతో వారికి కొకైన్ ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎన్నిరోజుల నుంచి వినియోగిస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు. గోవా, ముంబయి నుంచి ఫుడింగ్ పబ్‌కు డ్రగ్స్ వస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కొకైన్ సరఫరాకు అభిషేక్, అనిల్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
Pudding Pub Case Updates : మరోవైపు ఈ కేసులో నిందితుల కస్టడీపై ఇవాళ నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. నిందితులను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం సేకరించే అవకాశముందని తెలిపారు.