కరోనా నేపథ్యంలో (corona) అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పబ్‌లను నిర్వహించుకోవచ్చని నిబంధనలతో అనుమతులిస్తే కొందరు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని పబ్‌లలో ‘రెంట్ ఎ గర్ల్’ పేరుతో కొత్త దందాకు తెరతీసి గంటకు రెండు నుంచి మూడు వేలు ఇస్తే చాలు అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి పబ్‌లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భాలు అనేకం. తాజాగా ఇదే కోవకు చెందిన బేగంపేట్ కంట్రీ క్లబ్ (country club) ఆవరణలో నిర్వహిస్తున్న మూడు పబ్‌లను రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. అర్ధరాత్రి దాటినా పబ్‌లను నిర్వహిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారనే స్థానికుల ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మూడు పబ్‌లు సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.
మత్తులో ముంచుతూ..
అధికారులు హెచ్చరిస్తున్నా పబ్‌ల నిర్వహణ తీరులో మార్పు ఉండటం లేదు. అర్ధరాత్రి దాటినా వినియోగదారులకు మద్యం సరఫరా చేస్తూ వారిని మత్తులో ముంచుతున్నారు. దీంతో ఇలాంటి వారు ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. యువతీ, యువకులే కాదు కుటుంబాల్లోకి కూడా ఈ సంస్కృతి చొచ్చుకుపోయింది. తాజాగా గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌కు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఓ చిన్నారిని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. విద్యుద్దీప కాంతుల్లో.. ఉల్లాసాన్ని నింపే సంగీతంలో.. అందరూ ఊగిపోయారు. ఒళ్లు మరిచి చిందులేశారు. చిన్నారితో డ్యాన్స్.. డ్యాన్స్ అంటూ స్టెప్పులేయించారు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ పబ్‌కు నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు. నగరంలో సుమారు 40కి పైగా పబ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఒక్కో పబ్ 100 నుంచి 500 మంది సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. ఇంత మంది గుమిగూడే ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
12 కేసులు