యువతులు, మహిళలను వేధిస్తున్న సైకాలజిస్టు బి.పి నగేశ్‌ను హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని పలు కళాశాలల్లో మోటివేషనల్ స్పీచ్ కోసం నగేశ్ తరగతులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన నగేశ్ మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సందేహాలున్నవాళ్లు తనకు ఫోన్ చేయొచ్చని చరవాణి నెంబరు ఇచ్చాడు.
లైంగిక వేధింపుల కేసులో సైకాలజిస్టు అరెస్టు - hyderabad she team police
లైంగిక వేధింపుల కేసులో సైకాలజిస్ట్ బి.పి.నగేశ్ అరెస్టు అయ్యారు. హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో కౌన్సెలింగ్ క్లాసులు ఇచ్చిన నగేశ్.. అసభ్యంగా మాట్లాడారని విద్యార్థిని షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో బి.పి.నగేశ్‌కు నాంపల్లి కోర్టు 16 రోజుల రిమాండ్ విధించింది.
యువతులు ఫోన్ చేయగానే వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం, శారీరక వాంఛ తీర్చాలని కోరినట్టు ఓ యువతి హైదరాబాద్ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన షీ టీమ్ పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. సైకాలజిస్టు నగేశ్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి 16రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. వేధింపులకు గురయ్యే విద్యార్థులు, మహిళలు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయాలని, బాధితుల సమాచారం బహిరంగపర్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: