Psycho attacked on Farmer: పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. గ్రామానికి చెందిన రైతు దాసరి కొమురయ్య పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యలో కృష్ణ సాయి అనే వ్యక్తి కొమురయ్యను లిఫ్ట్ అడిగాడు. సరేననడంతో బైక్ వెనకాల కూర్చున్నాడు. ఆ కాసేపటికి బండి నడుపుతున్న రైతును వెనకనుంచి కృష్ణ సాయి కిరాతకంగా పొడిచాడు. ఆ వెంటనే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. సైకో దాడిలో కొమురయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
డ్రగ్స్ మత్తులో
కొమురయ్య రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు.. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన రైతు నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రథమ చికిత్స అనంతరం.. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని.. ఆ మత్తులో కత్తితో దాడి చేసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:ఖరీదైన కార్లు అద్దెకు తీసుకోవటం.. జీపీఎస్, నెంబర్ ప్లేట్ తొలగించి అమ్మేయటం..
Newly married couple accident : కారు బోల్తా.. కొత్త జంటకు తప్పిన పెను ప్రమాదం